రోడ్డు ప్రమాదంలో 5గురు దుర్మరణం
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీప అస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు చెరువు దగ్గర లారీని ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
మార్కాపురం వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఆటోలో ఆ సమయంలో పది మంది దాకా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఒక ప్రభుత్వోద్యోగి ఉన్నట్లు తెలుస్తోంది. ఒక మహిళ కూడా మరణించింది. గాయపడినవారిలో ఇద్దరు పిల్లలున్నారు. ప్రకాశం జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు.












Click it and Unblock the Notifications