బావిలో శవమై తేలిన మనీషా
వరంగల్: వారం రోజుల క్రితం వరంగల్ లోని కాశీబుగ్గ నుంచి కిడ్నాపయిన మనీషా అనే పన్నెండేళ్ల బాలిక మృతదేహం శవమై బావిలో తేలింది. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలపాలెం గ్రామంలోని వ్యవసాయ బావిలో మనీషా మృతదేహం బయటపడింది. శవం బాగా కుళ్లిపోయి ఉంది. తాటికాయలపాలెం బావిలో శవం పడి ఉందని తెలియగానే వరంగల్ జిల్లా ఎస్పీ సౌమ్యా మిశ్రా, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి, మనీషా తండ్రి అక్కడికి వెళ్లారు. మనీషా శవాన్ని ఆమె తండ్రి గుర్తించాడు.
వారం రోజుల క్రితం మనీషా కిడ్నాప్ జరిగింది. కిడ్నాప్ చేసినవారు మనీషా తల్లిదండ్రులకు ఫోన్ చేసి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ ఫోన్ ప్రజాప్రతిఘటన నక్సలైట్ల పేర వచ్చింది. తప్పుడు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా. కానీ పోలీసులు కిడ్నాపర్లను గుర్తించలేకపోయారు. కిడ్నాపర్లు మనీషాను హత్య చేసి శవాన్ని బావిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications