రోడ్డు ప్రమాదంలో 5గురు దుర్మరణం
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని మార్కాపురం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల వద్ద టూరిస్టు బస్సు సుమోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందినవారు. శ్రీశైలంలో దేవుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications