ఆలస్యంగా వస్తున్న డాక్టర్లపై చర్యలేవి: హైకోర్టు
హైదరాబాద్: విధులకు ఆలస్యంగా వస్తున్న డాక్టర్లపై తీసుకుంటున్న చర్యలేవని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జూనియర్ డాక్టర్ల సమ్మెపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితిపై రిజిస్ట్రార్ జనరల్ గురువారంనాడు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. సీనియర్ వైద్యులతో పాటు జూనియర్ డాక్టర్లు విధులకు ఆలస్యంగా వస్తున్నారని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని నివేదికలో తెలియజేసినట్లు సమాచారం.
వైద్యుల రక్షణకు ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం రోగుల రక్షణకు, వారికి సరైన వైద్యం అందడానికి తీసుకునే చర్యలేమిటో వివరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వారికి తగిన వైద్యం అందజేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవని ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications