నూజివీడులో ఐఐఐటి పార్కుకు శంకుస్థాపన
విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడులో 900 కోట్ల రూపాయలతో తలపెట్టిన ఐఐఐటి పార్కుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శుక్రవారంనాడు శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది ఈ పార్కుకు 150 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. మరో రెండు నెలల్లో మచిలీపట్నం షిప్ యార్డుకు శంకుస్థాపన చేస్తామని ఆయన చెప్పారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆధునీకరించి రాష్ట్రమంతటా సాగునీరందిస్తామని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లాలోని మహిళలకు 350 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గన్నవరం చేరుకున్నారు. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది.












Click it and Unblock the Notifications
