భారత్, అమెరికా భాయి, భాయి: కండోలిజారైస్
వాషింగ్టన్ : భారత్‌తో తమ సత్సంబంధాలు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజారైస్ స్పష్టం చేశారు. భారత్‌తో సరికొత్త సంబంధాలకు అమెరికా ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
దక్షిణాసియా దేశాలతో అమెరికా సంబంధాలు అనే అంశంపై శుక్రవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కండోలిజా రైస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ భవిషత్‌లోనూ భారత్‌తో ముఖ్యమైన సంబంధాలు అభివృద్ధి చేసుకునే దిశగా అమెరికా ముందుకు వెళుతుందని అన్నారు.
అలాగే పాకిస్థాన్‌లో ముషారఫ్ అత్యవసర పరిస్థితికి ముగింపు పలకడాన్ని ఆమె ప్రశంసించారు. ముషారఫ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పాక్‌లో నవీన ప్రజాస్వామ్యానికి తలుపులు తెరుచుకుంటాయని ఆమె అన్నారు.
అప్ఘనిస్థాన్ ప్రభుత్వానికి మద్దతుగా తాము, నాటో దళాలు చేస్తున్న యుద్ధంలో విజయం సాధించామని అన్నారు. అప్ఘనిస్థాన్‌కు భవిష్యత్‌లోను అమెరికా మద్దతు కొనసాగుతుందని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications