కాంగ్రెస్ పార్టీ వైయస్ జగన్ భజన:కోడెల

గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వారసుడు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పురంధ్రేశ్వరి చెప్పడం చాలా దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు విమర్శించారు. ముఖ్యమంత్రికి భజన చేస్తే పదవులు లభిస్తాయనే ఉద్ధేశంతోనే ఆమె ఇలాంటి వ్యాక్యలు చేసిందని ఆయన ఆగ్రహంతో అన్నారు. గుంటూరులో శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. భజన చేస్తే కాంగ్రెస్ పార్టీలో పదవులు లభిస్తాయనే నిజం వైయస్ జగన్ జన్మదినవేడుకలు నిరూపించాయని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, సోనియా గాంధీ భజన చేస్తుంటే, మంత్రులు వైయస్ భజన చేస్తున్నారు...కార్యకర్తలేమో వైయస్ జగన్ భజన చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇలా భజన కార్యక్రమాలు చేపడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. వైయస్ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారంనాడు కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పోటీ పడి చేసిన హంగామ జుగుస్ప కలిగించేలా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భజన కార్యక్రమాల నుంచి దృష్టిని మరల్చాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+