వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి ఆదాయం 2.16 కోట్లు
తిరుపతి: వైకుంఠ (ముక్కోటి)ఏకాదశి పర్వదినం నాడు 80 వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆరోజు హుండీ ఆదాయం 2.16 కోట్ల రూపాయలని టిటిడి జెఇవో బలరామయ్య విలేకరులకు చెప్పారు.
వైకుంఠ ఏకాదశి రోజున లక్ష మందికి దర్శన భాగ్యం కల్పించాలనుకున్నట్టు, అయితే వైకుంఠ వాకిలిలో భక్తులు ఎక్కువ సమయం గడపడంతో 80 వేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కల్పించగలిగామని ఆయన తెలిపారు. శుక్రవారం 75 వేల మంది భక్తులకు దర్శనం ఏర్పాటు చేశామన్నారు.












Click it and Unblock the Notifications