విజయవాడకు వంగవీటి రాధ!
విజయవాడ: తన శాసన సభ్యత్వానికి రాజీనామ సమర్పించిన వంగవీటి రాధాకృష్ణ 42 రోజుల తరువాత విజయవాడకు తిరిగి వచ్చారు. రాణిగారి తోట ప్రాంతంలో నివాసముంటున్న పేదల ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయడానికిగానూ ప్రభుత్వం నూతన జీవో జారీచేసిన నేపథ్యంలో ఆయన తిరిగి విజయవాడకు రావడంతో అభిమానులు పెద్దయెత్తున స్వగతం పలికారు. ర్యాలీ తీశారు. బాణాసంచా కాల్చారు.
ఈ సందర్భంగా ఈయన మీడియాతో మాట్లాడారు. తాను పెట్టిన డిమాండ్లలో మొదటి ఫేస్ డిమాండ్ నెరవేరిందని ఆయన అన్నారు. రాజీనామాను వెనక్కు తీసుకుంటారా లేదా అన్న విషయంపై ఆయన స్పష్టంగా ఏమీ చెప్పలేదు. మరికొన్ని డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుండా పక్కనపెట్టింది, తన రాజీనామా అంశం కూడా పక్కన పెట్టానని రాధాకృష్ణ చెప్పారు. మీరెలా అనుకున్నా పరవాలేదని అన్నారు. విజయవాడలో భూ దందా పెద్ద యెత్తున చేపట్టిన దేవినేని హైదరాబాద్ పై కన్నేసారని ఆయన విమర్శించారు. ఆ విషయం ఇంకా తేలాల్సిఉందని రాధా అన్నారు.












Click it and Unblock the Notifications