బీవీ రాఘవులు కూతురు సుజన పెళ్లి
హైదరాబాద్:సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు కుమార్తె సుజన వివాహం గురువారం(డిసెంబర్ 27న)నాడు జరిగింది. పెళ్లి కొడుకు మహమ్మద్. ఈయన సెంట్రలో యూనివర్సిటీలో చదువుతున్న సుజన సహద్యాయి. మహమ్మద్ తండ్రి సయ్యద్ అలీ జహీర్ ప్రముఖ ఉర్దూ కవి . ఈ పెళ్లికి ఇరువురి తల్లితండ్రులు ఆమోదం తెలిపారు.
నగరంలోని బాగ్ లింగంపల్లిలోని పుచ్చలపల్లి సుందరయ్య కళా నిలయంలో వీరి వివాహం జరిగింది. కమ్యూనిస్టు నాయకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రాఘవులు తన కూతురు వివాహాన్ని నిరాడంబరంగా జరిపారు. పార్టీ శ్రేణుల్లో ముఖ్యులు, సన్నిహితులను మాత్రమే ఆయన ఈ పెళ్లికి ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications
