రాత్రి 12 వరకే మద్యం షాపులు: హైకోర్టు
హైదరాబాద్: సోమవారం డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటలకే మద్యం షాపులు మూసేయాలని హైకోర్టు ఆదేశించింది. 2007వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే వేళ సోమవారం అర్థ రాత్రి దాటిన తర్వాత ఒంటి గంట వరకు బారులు, మద్యం షాపులు తెరిచి ఉంచడానికి ఇచ్చిన అనుమతిపై హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా మద్యం షాపులు, రెస్టారెంట్లు, బారులు తెరిచి ఉంచడానికి అనుమతి ఇస్తూ జారీ అయిన ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు స్పందించింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ కూడా మండిపడింది.












Click it and Unblock the Notifications