న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు, యుపిఎ చైర్ పర్సన్ సోనియాగాంధీ సోమవారం రాత్రి స్వల్ప అస్వస్ధతతో ఆస్పత్రిలో చేరారు. సోనియా గాంధీకి దీర్ఘకాలంగా ఆస్ధమా వ్యాధి ఉంది. చలికాలంలో ఆ వ్యాధి తీవ్రమవుతుంది.
రాత్రి ఆస్ధమా తీవ్రం కావడంతో ఆమెను స్ధానిక సర్ గంగారాం ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.