సహజ వనరులపై దృష్టిపెట్టంఢి:ప్రధాని

Manmohan Singh
విశాఖపట్టణం:సహజ వనరులను ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడం మూలంగా అవి తరిగిపోయే ప్రమాదం ముంచుకొస్తోందని ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. ఇకనైనా మేల్కొని సహజవనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ధీర్ఘకాలిక వ్యూహాలతో ముందడుగు వేయాలని ఆయన హితవు పలికారు. విశాఖపట్టణంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 95వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించిన అనంతంరం ప్రధాని మాట్లాడారు.

వస్తువులను వాడి పడవేసే అలవాటు పాశ్చాత్యులదని, అది మన సంప్రదాయం కాదని, అందుకే మన వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సంప్రదాయిక విజ్ఞానాన్ని మేళవించి పరిశోధనలు జరపాల్సిన భాద్యత పరిశోధకులపై ఉందని ప్రధాని అన్నారు. 11వ పంచవర్ష ప్రణాళికలో జాతీయ విద్యా ప్రణాళిక కోసం లక్ష కోట్లు కేటాయించామని, అందరికీ ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో దేశంలో కొత్తగా 30 విశ్వవిద్యాలయాలు, 5 విజ్ఞాన శాస్త్ర పరిశోధనాలయాలను నిర్మించనున్నామని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+