అన్న పార్టీ పెట్ట్టకపోతే బిఎస్పీలోకి పవన్ కళ్యాణ్!
State
-Staff
By Staff
హైదరాబాద్: అన్నయ్య చిరంజీవి సొంత పార్టీ పెట్టని పక్షంలో బిఎస్పీలో చేరతానని ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు బిఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాష్ విలేకరుల సమావేశంలో చెప్పారు. అయితే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సన్నిహితులు ఖండించారు. పవన్ కళ్యాణ్ ను నల్లా సూర్యప్రకాష్ ఏనాడూ కలవలేదని వారు వివరించారు.
ఈనెల ఆరో తేదీన నగరంలో ఏర్పాటు చేయనున్న మాయావతి బహిరంగసభలో చిరంజీవి పాల్గొనే అవకాశముందని సూర్యప్రకాష్ ప్రకటించడం కొసమెరుపు.