నేటి నుంచి విశాఖలో సైన్స్ కాంగ్రెస్

విశాఖపట్టణం: విశాఖపట్టణంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ప్రధాని మన్మోహన్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం సాయంత్రమే విశాఖ చేరిన సంగతి తెలిసిందే.

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు వేదిక కానుంది. నేటినుంచి ఐదురోజులుపాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఈ సారి సముద్ర విజ్ఞాన శాస్త్రం, బయో ఇన్ఫర్మాటిక్స్, వేదవిజ్ఞానం, నానో టెక్నాలజీ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.

ఈ సమావేశాలకోసం బుధవారం విశాఖ చేరిన ప్రధాని పలు కార్యక్రమాల్లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా తూర్పు నౌకాదళ వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ డేగను ప్రధాని సందర్శించారు. ఈ సందర్శనలో ప్రధానికి భారత నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ సురీష్ మెహతా, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, కేంద్ర మంత్రులు తదితరులు స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+