2007లో తిరుమల హుండీ ఆదాయం 416 కోట్లు
తిరుమల:2007 సంవత్సరంలో తిరుమల దేవాలయంలోని శ్రీవారి హుండీ ద్వారా 416 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గత సంవత్సరంలో మొత్తం 20 కోట్లకు పైగా భక్తులు శ్రీవారిని సందర్శించుకున్నట్లు టిటిడి అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.
పెరుగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్టు శ్రీవారి దర్శనానికి సులువైన మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇకపై పర్వదినాల సమయంలో విఐపి పాస్‌లను అనుమతించబోమని కరుణాకర్ రెడ్డి తెలియజేశారు.
ప్రోటోకాల్ ఉన్న నాయకులను మాత్రమే ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. 2008లో 25 కోట్ల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు కరుణాకర్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications
