ఒంగోలులో బాలయ్య ఫ్యాన్స్ వీరంగం


విజయవాడ/ ఒంగోలు/ తిరుమల: తెలుగు సినీ హీరో బాలకృష్ణ అభిమానులు శుక్రవారంనాడు ప్రకాశం జిల్లా ఒంగోలులో వీరంగం వేశారు. థియేటరుపై దాడి చేసి ధ్వంసం చేశారు. బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు సినిమా ప్రదర్శనలో కొద్దిపాటి జాప్యం జరిగినందుకు వారు కల్లు తాగిన కోతుల్లా వ్యవరించారు. థియేటర్ ఫర్సీచరును, అధ్దాలను, తలుపులను ధ్వంసం చేశారు.

మరోవైపు విజయవాడలో బాలకృష్ణ పట్ల అభిమానులు వినూత్నంగా తమ అభిమానాన్ని ప్రదర్శించుకున్నారు. విజయవాడలో అభిమానులు ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాలయ్య పోస్టరుకు క్షీరాభిషేకం చేశారు. ఆ తర్వాత ఒక్క మగాడు సినిమా చూడడానికి బయలుదేరారు. బాలయ్య నటించిన ఒక్క మగాడు సినిమా పట్ల ఎనలేని క్రేజ్ ఏర్పడింది. సినిమాను చూడడానికి బాలయ్య అభిమానులు థియేటర్లకు పెద్ద యెత్తున తరలివచ్చారు.

ఇదిలా ఉంటే, బాలయ్య శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఒక్క మగాడు సినిమా విడుదల సందర్భంగా ఆయన తిరుమలను సందర్శించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆయనకు ఆలయ సిబ్బంది సంప్రదాయం ప్రకారం ఆహ్వానం పలికారు. ఫొటోలు తీసుకోవడానికి బాలయ్య సహకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+