బాసర: రాష్ట్రంలో ఐఐటి స్థాపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బాసరలోనే ఐఐటి ఏర్పాటుకు తాము కూడా సుముఖంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండాలనే ఉద్ధేశంతోనే కేంద్రప్రభుత్వం మెదక్ ను సూచించిందని అన్నారు. దానిని రాష్ట్రప్రభుత్వం వ్యతిరేకిస్తే ప్రతిష్టాత్మక ఐఐటి మరో రాష్ట్రానికి తరలివెళ్లే అవకాశం ఉందని భావించే మెదక్ లో అయినా అభ్యంతంరం చెప్పలేదని ఆయన వివరించారు. ఐఐటిని బాసరలో నెలకొల్పడంలేదనే బాధ ఉండకూడదనే ఉద్ధేశంతోనే ఇక్కడ ట్రిపుల్ ఐటిని సాంక్షన్ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.