'వైయస్ కు ఒక్క కార్యకర్త మిగలడు'
హైదరాబాద్: తెలంగాణపై రెండో ఎస్సార్సీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తానని ప్రకటించడంలో తమ పార్టీ సీనియర్ నేత జి. వెంకటస్వామికి వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవచ్చునని కాంగ్రెస్ శాసనసభ్యుడు పి. శంకర్ రావు అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ఒక్క కార్యకర్త కూడా మిగలడని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలంగాణపై పార్టీ అధిష్ఠానవర్గాన్ని బ్లాక్ మెయిల్ చేయవద్దని ఆయన సూచించారు. 2009లో తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తారని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీ పార్టీ అధిష్ఠావర్గం నిర్ణయం కాదని, అది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications