కెసిఆర్ కు దత్తాత్రేయ చురకలు
మెదక్: మూకుమ్మడి రాజీనామాల వల్ల తెలంగాణ రాష్ట్రం రాదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) బండారు దత్తాత్రేయ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావునుద్దేశించి అన్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేస్తే తాము సామూహిక రాజీనామాలు చేస్తామని చంద్రశేఖరరావు చేసిన ప్రకటనపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో తెరాస చేసుకున్న తప్పుడు ఒప్పందాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తామని ఆయన చెప్పారు.
తెలంగాణపై సోనియా గాంధీ మౌనం వీడాలని ఆయన సూచించారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన సోనియా గాంధీని డిమాండ్ చేశారు. తెలంగాణపై ప్రణబ్ కమిటీ వేసినప్పుడే తెరాస ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సి ఉండిందని ఆయన అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టేలా తాము కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications