నేనూ రాజీనామా చేస్తా: ఉప్పునూతల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తాను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల లోపే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమను శాసనసభ్యులుగా గౌరవించి తమను ప్రజాప్రతినిధులుగా ప్రజలు తమను ఎన్నుకున్నారని, తమ శేష జీవితం ఇక్కడే గడపాల్సి ఉందని, అందువల్ల ఇక్కడి ప్రజల మనోభావాలను తాము పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రాంత ప్రజల బాధలను, ఇబ్బందులను, మనోభావాలను తాము ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నామని, తమ మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదని, తమ మాటలను వినడం లేదని, తాము ఎందుకు అలా మాట్లాడుతున్నామని అడిగినవారు లేరని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకులందరి మాటా ఒక్కటేనని, తెలంగాణ ఇవ్వకపోతే పార్టీకి మనుగడ ఉండదని ఆయన అన్నారు. కేంద్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తెలంగాణలో గెలవాల్సిందేనని, తెలంగాణ ఇవ్వకపోతే అది సాధ్యం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications