సీమ రాష్ట్రం ఇవ్వాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని కర్నూలు జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యులు అన్నారు. వారు ఆదివారం ఇక్కడ సమావేశమయ్యారు. ప్రకాశం, నెల్లూరూ జిల్లాలతో కలిపి ఆరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని గంగుల ప్రతాపరెడ్డి, ఎరాసు ప్రతాపరెడ్డి అన్నారు. ఈ నెలాఖరున ఢిల్లీకి వెళ్లి ఈ మేరకు తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేస్తామని వారు చెప్పారు.
మద్రాసు నుంచి విడిపోయినప్పుడు తాము అందుకు అంగీకరించామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు తాము రాజధానిని కోల్పోయామని, రాష్ట్రం మొత్తం కలిసి ఉంటే అభివృద్ధి చెందుతామని అనుకున్నామని వారు చెప్పారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని అడుగుతామని వారు చెప్పారు. తెలంగాణ డిమాండ్ ఉందని, అది కాంగ్రెస్ చేయాల్సిందని వారన్నారు. రెండో ఎస్సార్సీ వేస్తే తమ ప్రాంత ప్రజల మనోభావాలను కూడా వినిపించే అవకాశం కల్పించాలని వారు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications