తెలంగాణపై వైయస్ మాట్లాడాలి: కాకా
హైదరాబాద్: తెలంగాణపై ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి స్పందించాలని, ఇంత దూరం వచ్చాక తెలంగాణపై రాజశేఖర రెడ్డి మాట్లాడకపోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ పార్లమెంట్ సభ్యుడు జి. వెంకటస్వామి అన్నారు. రాజశేఖర రెడ్డి ఆంధ్రకు మాత్రమే ముఖ్యమంత్రి కారని, తెలంగాణకు కూడా ముఖ్యమంత్రి అని, అందువల్ల తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని రాజశేఖర రెడ్డి మాట్లాడాల్సి ఉంటుందని ఆయన ఒక ప్రైవేట్ తెలుగు టీవి చానెల్ ప్రతినిధితో అన్నారు. తెలంగాణ అంశాన్ని సోనియాగాంధీ చూసుకుంటారని రాజశేఖర రెడ్డి మాట్లాడితే సరిపోదని ఆయన అన్నారు.
రెండో ఎస్సార్సీ వేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే వేయాల్సి ఉండిందని, ఎన్నికలు సమీపించిన సమయంలో వేయాలనుకోవడం సరి కాదని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సార్సీ వేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం వస్తుందా, రాదా అనే విషయం తేలిపోయి ఉండేదని, ఇప్పుడు దాని వల్ల లాభం లేదని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీ గురించి తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ మాట్లాడడం తప్పు కాదని, ఆ ప్రకటన చేయడంలో మొయిలీ తప్పేమీ లేదని, పార్టీ విధానాన్ని మాత్రమే చెప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications