తెలంగాణపై కాకాకు వైయస్ సలహా
హైదరాబాద్: తెలంగాణ అంశంపై తమ పార్టీ సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి తమ పార్టీ నేత సోనియా గాంధీతో మాట్లాడితే మంచిదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మాట్లాడాలని వెంకటస్వామి అన్న విషయం తెలిసిందే. వెంకటస్వామి ప్రకటనపై ముఖ్యమంత్రి ఒక తెలుగు టీవీ చానెల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతిస్పందిస్తూ వెంకటస్వామి సీనియర్ నాయకుడు, సిడబ్ల్యుసి సభ్యుడు అని, అందువల్ల వెంకటస్వామి సోనియాతో మాట్లాడితే మంచిదని ఆయన అన్నారు. కాంగ్రెసులో ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు అది చేస్తామని ఆయన అన్నారు.
కాంగ్రెసులో ప్రజాస్వామ్యం ఎక్కువని, దాంతో తమ పార్టీ నాయకులు ఏదో ఒక్కటి స్వేచ్ఛగా మాట్లాడుతారని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీ అనేది చాలా సున్నితమైన అంశమని, దీంతో మీడియా వాళ్లు వెళ్లి మైకులు ముందు పెడతారని, దాంతో మాట్లాడక తప్పదని ఆయన అన్నారు. ఎస్సార్సీ అంశంపై ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని ఆయన అన్నారు. తెలంగాణపై సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిందని ఆయన అన్నారు. ఎస్సార్సీ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications