కెసిఆర్ కు కొత్త కాదు: జయప్రకాష్
మెదక్: తెలంగాణకు డెడ్ లైన్లు పెట్టడం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు కొత్తేమీ కాదని ఆ పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు జయప్రకాష్ రెడ్డి అన్నారు. ఇటువంటి డెడ్ లైన్ల ద్వారానే కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పూటకో మాట చెప్పడం వల్ల ప్రజల్లో నమ్మకం పోతుందని చెప్పడం వల్లనే తమను పార్టీకి దూరం పెట్టారని ఆయన అన్నారు.
పార్టీకి చెందిన శాసనసభ్యులు 26 మంది ఉంటే 16 మందే రాజీనామా చేస్తారని కెసిఆర్ ఎలా చెబుతారని ఆయన అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోతామని తాను అనలేదని, కెసిఆర్ తమను మొదటి నుంచీ పక్కన పెడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications