పిఎస్ ఎల్వీ -సి10 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: పిఎస్ ఎల్వీ -సి10 రాకెట్ ను నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం విజయవంతంగా ప్రయోగించింది. పిఎస్ ఎల్వీ - సీ10 సాయంతో ఇజ్రాయెల్ ఉపగ్రహం పొలారిస్ ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పంపించారు. నాలుగు దశల్లో దీన్ని కక్ష్యలోకి పంపించారు. 17 నిమిషాల వ్యవధిలో పిఎస్ ఎల్వీ నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది.
షార్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇది 24వది. తమ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వాణిజ్యపరంగా ఉపగ్రహాల ప్రయోగంలో షార్ మరో ముందడుగు వేసినట్లయింది. దీని ప్రయోగానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగానికి మీడియాను దూరంగా ఉంచారు.












Click it and Unblock the Notifications