కాకాతో హరీష్ రహస్య చర్చలు
హైదరాబాద్: తెలంగాణ పట్టుపడుతున్న సీనియర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామితో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు సోమవారం రహస్య మంతనాలు జరిపారు. ఇరువురి మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు జరిగాయి. చర్చల వివరాలు వెల్లడించడానికి హరీష్ రావు నిరాకరించారు. తెలంగాణపై మాట్లాడుతున్న వెంకటస్వామి పెద్ద మనిషి కాబట్టి తాను పలకరించడానికి వచ్చానని హరీష్ రావు మీడియా ప్రతినిధులతో అన్నారు.
తమ అల్టిమేటమ్ కు కాకా మద్దతు తెలుపుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై అనుసరించాల్సి వ్యూహం గురించి మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ విషయంలో గళమెత్తుతున్న కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి కాంగ్రెస్ అధిష్ఠానవర్గంపై ఒత్తిడి తేవాలనే తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వ్యూహంలో భాగంగానే హరీష్ రావు కాకాను కలిసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications