తెలంగాణ సాధ్యం కాదనలేదు: వైయస్
హైదరాబాద్: తన వ్యాఖ్యలను ఒక తెలుగు దినపత్రిక వక్రీకరించిందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఈ టర్మ్ లో తెలంగాణ రాదని ఒక తెలుగు దినపత్రికలో తాను అన్నట్లు వచ్చిన వార్తపై ఆయన మంగళవారం వివరణ ఇచ్చారు. పెద్ద భార్య మంచిది కాదంటే చిన్న భార్య చెడ్డది అనే పద్ధతిలో ఆ పత్రిక వార్త రాసుకున్నదని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) అని, తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి అన్ని పార్టీలను ఒప్పించాల్సి ఉంటుందని, అది కష్టమైనందున కాంగ్రెస్ కు మెజారిటీ ఇస్తే తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ కు స్వతంత్ర ఉంటుందని తాను అన్నట్లు ఆయన వివరించారు.
తెలంగాణపై సోనియా నిర్ణయం తమకు శిరోధార్యమని ఆయన అన్నారు. తెలంగాణపై సోనియా గాంధీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. తెలంగాణపై సోనియాకు నిర్ణయాధికారాన్ని కట్టబెట్టామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సాధ్యం కాదని తాను అనలేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications