నల్లగొండ: అభివృద్ధి తమ పౌర హక్కు అని, తెలంగాణ తమ జన్మహక్కు అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ద్రోహం చేస్తున్నాయని ఆయన బుధవారం విమర్శించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలంగాణ అస్తులను అమ్ముకుంటున్నారు, అమ్ముకున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బిసిలకు 40 శాతం, ఎస్సీ ఎస్టీలకు 12 శాతమేసి రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడికి మూడేసి ఎకరాల భూమి ఇస్తామని ఆయన చెప్పారు.