హెచ్ డిఎఫ్ సిలో కాల్పులు: అధికారికి గాయాలు
హైదరాబాద్: హైదరాబాదులోని బర్కత్ పురా హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ శాఖ కార్యాలయంలో బుధవారం కాల్పులు జరిగాయి. కార్యాలయం భవంతి యజమాని బండారు శ్రీకాంత్ చేతిలోని రివాల్వర్ పేలింది. ఈ ఘటనలో బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాంత్ తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. చికిత్స నిమిత్తం శ్రీకాంత్ ను హైదర్ గుడలోని అపోలో అస్పత్రికి తరలించారు.
భవంతి యజమాని బండారు శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసు కమీషనర్ ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బండారు శ్రీకాంత్ కు రెండు రివాల్వర్ లైసెన్సు వచ్చింది. దాన్ని ఎలా ఆపరేట్ చేయాలనే విషయంపై శ్రీకాంత్ ల మధ్య ఆరగంట చర్చలు జరిగాయని, ఈ సమయంలో అనుకోకుండా రివాల్వర్ పేలిందని అంటున్నారు. అయితే పోలీసుసు ఈ సంఘటనను మిస్టరీగా భావించి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన శ్రీకాంత్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications