ఒబామాపై పోరులో హిల్లరీ ముందంజ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికోసం జరిగే ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి హోరాహోరీ పోరులో ఒబామాపై హిల్లరీపై చేయి సాధించారు. మహా మంగళవారం జరిగిన ఎన్నికల్లో అధిక రాష్ట్రాల్లో ఒబామా ముందంజలో నిలిచినప్పటికీ, కీలకమైన న్యూయార్క్, కాలిఫోర్నియాలలో గెలవడం ద్వారా హిల్లరీదే పైచేయిగా కన్పించింది. మంగళవారం నాటి ఎన్నికల్లో జార్జియా, అలబామా, కనెక్టికట్, దేలవార్, మిన్నెసోటా, కాన్సాస్, ఉతా, ఉత్తర డకోటా, ఇల్లినోయిస్, కొలరాడోలలో విజయం సాధించగా, క్లింటన్ న్యూయార్క్, కాలిఫోర్నియాలతో పాటు అర్కాన్సాస్, మిస్సౌరీ, ఓక్లహామా, టెన్నిస్సీలలో గెలుపొందారు.
అధ్యక్ష పదవికి అర్హత కోసం ఆగస్టులో జరిగే పార్టీ సదస్సు నాటికల్లా 2025 ప్రతినిధుల మద్దతు కూడగట్టాల్సిన తరుణంలో ఈ ఎన్నికలు ముగిసేసరికి క్లింటన్ 732, ఒబామా 639 మంది ప్రతినిధుల మద్దతుతో ముందుకు సాగుతున్నారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ కారణంగా ఆ పార్టీ తరపున నిలిచిన మిగిలిన అభ్యర్థులు ఇప్పటికే పోరు నుంచి తప్పుకున్నారు.












Click it and Unblock the Notifications