విశాల్ ను ప్రేమించలేదు: నయనతార

చెన్నై: తాను ప్రముఖ హీరో విశాల్ తో ప్రేమలో పడలేదని ప్రముఖ తార నయనతార అంటోంది. పొగరు వంటి చిత్రాల్లో నటించి తమిళంలో విజయం సాధించిన తెలుగు కుర్రాడు విశాల్ తో నయనతార ప్రేమలో పడినట్లు తమిళ పత్రికలు వార్తలు రాశాయి. ఆ వార్తలను నయనతార ఖండించింది. తాను మళ్లీ ప్రేమలో పడలేదని ఆమె స్పష్టం చేసింది. శింబుతో ప్రేమలో పడిన నయనతార ఆ తర్వాత అతనికి దూరమైంది. ఆ తర్వాత ఇటీవలి వరకు మీడియాకు ముఖం చాటేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తుండడంతో ఆమెపై ఈ ప్రేమాయణం కథ ముందుకు వచ్చింది.

తాను ఒక పెద్ద హీరోయిన్ ను ప్రేమిస్తున్నానని విశాల్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఈ హీరోయిన్ పేరును అతను వెల్లడించలేదు. దీంతో విశాల్, నయనతారల మధ్య రోమాన్స్ నడుస్తున్నట్లు పత్రికలు వార్తాకథనాలు ప్రచురించాయి. వీరిద్దరు కలిసి సెల్యూట్ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సారి ఏ మాత్రం కూడా తొణకకుండా మీడియా ముందుకు వచ్చి తాను మళ్లీ ప్రేమలో పడలేదని నయనతార చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+