మండలి నుంచి తెరాస, టిడిపి వాకౌట్
హైదరాబాద్: శాసనమండలి నుంచి మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు, తెలుగుదేశం సభ్యులు వాకౌట్ చేశారు. తెలంగాణపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడాన్ని నిరసిస్తూ తెరాస సభ్యులు వాకౌట్ చేయగా, గవర్నర్ ప్రసంగంపై చర్చను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తప్పు దారి పట్టినస్తున్నారని విమర్శిస్తూ తెలుగుదేశం సభ్యులు వాకౌట్ చేశారు.
గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించకపోవడంపై వాకౌట్ చేసిన అనంతరం తెరాస ఎమ్మెల్సీ దిలీప్ విమర్శించారు. ప్రాంతీయ అసమానతలు తొలగిస్తామనే మాటతో తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
