ముగిసిన టీటీడీ ఛైర్మన్ పదవీ కాలం- పాలనా బాధ్యతలు వారికి కేటాయింపు, ఉత్తర్వులు..!!
టీటీడీ పాలకవర్గం కాల పరిమితి ముగిసింది. ప్రస్తుత ఛైర్మన్.. బోర్డు సభ్యులు రెండేళ్ల కాలం పదవి లో కొనసాగారు. దీంతో, కొత్తగా టీటీడీ ఛైర్మన్, సభ్యుల నియామకం పైన పెద్ద ఎత్తున చర్చ జరగ్గా.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ప్రభుత్వం కొత్త కమిటీ ఏర్పాటు పెండింగ్ లో ఉంచింది. దీంతో.. టీటీడీ పాలనా బాధ్యతల కోసం కొత్త కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
టీటీడీ పాలక వర్గం గడువు పూర్తయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవంబర్ 1న బీఆర్ నాయుడు ఛైర్మన్ గా.. సభ్యులతో కమిటీ రెండేళ్ల కాల పరిమితితో నియామకం చేసింది. ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. దీంతో, టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 658 జారీ చేసింది. ఈ అథారిటీ చైర్మన్గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అలాగే సభ్యులుగా ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యే వరకు లేదా ఏడాది పాటు ఈ అథారిటీ కొనసాగనుంది. టీటీడీ ధర్మకర్తల మండలికి ఉండే అన్ని అధికారాలు, విధులను దీనికి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

కొత్త బోర్డు లో అవకాశం కోసం పోటీ
ఈ కమిటీ TTD పాలకమండలికి ఉండే అన్ని అధికారాలను వినియోగించడంతో పాటు, పాలక డలి నిర్వహించాల్సిన అన్ని విధులను నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం, 1987లోని సెక్షన్ 137 ప్రకారం ఈ ప్రత్యేక అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ ప్రత్యేక అధికారుల కమిటీ ఒక సంవత్సరం పాటు లేదా నూతన పాలకమండలి ఏర్పాటు అయ్యే వరకు, ఈ రెండింటిలో ఏది ముందుగా జరిగితే అప్పటివరకు కొనసాగుతుంది. కాగా.. పంచాయితీ ఎన్నికలు పూర్తయిన తరువాత కొత్త పాలక వర్గం పైన కసరత్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇద్దరు టీడీపీ సీనియర్ల పేర్లు ఛైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సభ్యుల ఖరారు పైన కసరత్తు కొనసాగనుంది.













Click it and Unblock the Notifications
