అల్లర్లు కెసిఆర్ రహస్య ఎజెండా: షబ్బీర్
హైదరాబాద్: హిందూ ముస్లిం తగాదాలను సృష్టించాలనేది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు రహస్య ఎజెండా అని రాష్ట్ర విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. హిందూ ముస్లిం తగాదాలు సృష్టించడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నిస్తున్నారని కెసిఆర్ చేసిన విమర్శిపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు కెసిఆర్ ను నాయకుడిగా గుర్తించడం లేదని, దీంతో కెసిఆర్ కు మతి భ్రమించిందని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాదులో మతకల్లోలాలకు, అల్లర్లకు, విధ్వంసానికి పాల్పడడం కెసిఆర్ రహస్య ఎజెండాలో భాగమని ఆయన అన్నారు. కెసిఆర్ వీధి రౌడీ అని, కెసిఆర్ కు భాషాసంస్కృతులు తెలియవని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ పిచ్చివాడి మాదిరిగా తయారయ్యారని ఆయన అన్నారు. గల్ఫ్ బాధితుల విషయంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ చేసిందేమీ లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
