'ఈనాడు'పై వైయస్ ఆగ్రహం

తన పాలన గుప్త స్వర్ణయుగాన్ని గుర్తుకు తెస్తోందని ఆయన కితాబు ఇచ్చుకున్నారు. రాష్ట్రంలో సిరుల పంట కోసమే తాము జలయజ్ఞాన్ని తలపెట్టామని ఆయన అన్నారు. ఈనాడు దినపత్రికకు తాము చేస్తున్న అభివృద్ధి పట్టదని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు లేవని, ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలోనూ అవకతవకలు లేవని ఆయన అన్నారు. ఈ సమయంలో తెలుగుదేశం సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యంతరం చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి ఆగ్రహించిన తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. తెలుగుదేశం సభ్యుల సస్పెన్షనుకు శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య తీర్మానాన్ని ప్రతిపాదించారు. దేవాదుల ప్రాజెక్టు పైపుల లైన్లు పగిలిపోవడంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. ముఖ్యమంత్రి సమాధానం తర్వాత ప్రభుత్వం ప్రకటన చేస్తుందని స్పీకర్ చెప్పారు.












Click it and Unblock the Notifications