కోట్లకు పడగలెత్తిన గౌతంరెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ జలమండలి డైరెక్టర్ గౌతం రెడ్డి ఇళ్లపై, ఆయన బంధువుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు బుధవారంనాడు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోటి రూపాయలకు పైగా ఆస్తులను వారు కనుక్కున్నారు. ఏక కాలంలో గౌతం రెడ్డికి చెందిన 11 చోట్ల వారు సోదాలు నిర్వహించారు. హైదరాబాదుకు మంచినీరందించే కృష్ణాజలాల తరలింపు ప్రాజెక్టులో జరిగిన అవినీతిలో గౌతంరెడ్డికి పాత్ర ఉందనే ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరిగాయి.
గౌతం రెడ్డికి చెందిన బల్కంపేట ఇంటిపైనే కాకుండా, ఆయన స్వస్థలం సంగారెడ్డిలో కూడా ఎసిబి అధికారులు సోదాలు చేశారు. హైదరాబాదులో ఆయనకు మూడు విలాసవంతమైన భవనాలు ఉన్నట్లు, సంగారెడ్డిలో పది ఎకరాల వ్యవసాయ భూములు, ఒక చిన్నపాటి ఇల్లు ఉన్నట్లు వారు తేల్చారు. ఐదు ప్లాట్లు ఉన్నట్లు కూడా ఎసిబి సోదాలో తేలింది. 3.9 లక్షల విలువ చేసే బంగారు నగలు ఉన్నాయని ఎసిబి అధికారులు చెప్పారు. ఇంకా బ్యాంక్ లాకర్లు తెరవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications