వెనకబడ్డ ప్రాంతాలపై కమీషన్: వైయస్
హైదరాబాద్: వెనకబడిన ప్రాంతాలపై అధ్యయనానికి చట్టబద్దమైన కమీషన్ వేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బుధవారం శాసనసభలో ప్రకటించారు. కమీషన్ ద్వారా అధ్యయనం చేయించి వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. జిల్లావారీగా గానీ, ప్రాంతాల వారీగా గానీ ఈ అధ్యయనం చేపట్టవచ్చునని ఆయన అన్నారు. ఈ అధ్యయనం తర్వాత వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధించవచ్చునని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రాంతానికి తక్కువ నిధులు కేటాయిస్తున్నామనే మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు. గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో మావోయిస్టు, నక్సల్స్ కార్యకలాపాలు, హింస తగ్గాయని ఆయన అన్నారు. ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల నక్సల్స్ హింసను తగ్గించగలిగిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications