పోలీసు స్టేషనులో రామోజీ లొంగుబాటు

Ramoji Rao
విశాఖపట్నం: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు, ఆయన కుమారుడు కిరణ్ బుధవారం ఉదయం విశాఖపట్నం త్రీటౌన్ పోలీసు స్టేషనులో లొంగిపోయారు. వెంటనే పది వేల రూపాయల పూచీకత్తు సమర్పించి బెయిల్ పై విడుదలయ్యారు.

విశాఖపట్నంలోని భూ యజమానిని మోసగించారనే ఆరోపణపై హైకోర్టు ఆదేశాల మేరకు రామోజీరావు పోలీసుల ముందు లొంగిపోయారు. విశాఖపట్నంలోని వర్మకు చెందిన భూమి విషయంలో మోసానికి గాను ఆయనపై పోలీసులు చీటీంగ్ కేసు నమోదు చేశారు.

కేసు పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి - రామోజీరావు తన సంస్థ కోసం వర్మ నుంచి భూమిని లీజుకు తీసుకున్నారు. అయితే యజమానికి తెలియకుండానే కొంత భూమిని రోడ్డు విస్తరణ పనులకు అప్పగించారు. దానికి ప్రతిగా నష్టపరిహారం కింద వచ్చిన 800 గజాల భూమిని యజమానికి తెలియకుండా తన సంస్థ పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టులో కేసు వేశారు. దీనిపై రామోజీరావు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ముందు విశాఖపట్నం త్రీటౌన్ పోలీసు స్టేషనులో లొంగిపోవాలని రామోజీరావును ఆదేశిస్తూ అందుకు కొంత గడువు ఇచ్చింది. దీంతో ఆయన తన కుమారుడు కిరణ్ తో కలిసి పోలీసు స్టేషనులో లొంగిపోయి, బెయిల్ తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+