ఇక వాహనాల వేగం 65 కి.మీ మించరాదు
హైదరాబాద్: మార్చి ఒకటో తేదీ నుంచి వాహనాల వేగానికి కళ్ళెం వేయాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా వర్తిస్తాయి. వాహనాల వేగాని నియంత్రించడానికి రవాణా శాఖకు అనుమతిని ఇస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్టు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సిఎల్ ఎన్ గాంధీ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా గంటకు 65 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించే వాహనాల యజమానుల మీద, డ్రైవర్ల మీద రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications