ప్రయాణికులపై లాలూ రైలు కరుణ

Laloo Prasad Yadav
న్యూఢిల్లీ: ప్రయాణికులపై రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కరుణ చూపించారు. 2008 - 2009 సంవత్సరానికి గాను ఆయన మంగళవారం ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్టులో ఆయన రైల్వే చార్జీలను తగ్గించారు. వివిధ వర్గాల ప్రయాణికులకు రాయితీలు కూడా కల్పించారు. స్లీపర్ కోచ్ ల చార్జీలను 5 శాతం, ఎసి - 1 చార్జీలను 7 శాతం, సెకండ్ క్లాసు చార్జీలను 5 శాతం, ఎసి త్రీటైర్ చార్జీలను 2 శాతం తగ్గించారు. సీనియర్ సిటిజన్స్ కు చార్జీలో 50 శాతం, 50 ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం, ఆస్పత్రులకు వెళ్లే ఎయిడ్స్ రోగులకు 50 శాతం రాయితీలు కల్పించారు. డిగ్రీ వరకు బాలికలకు, ఇంటర్మీడియట్ వరకు మగపిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. చదువుకుంటున్న బాలికలకు ఉచిత సీజనల్ టికెట్లు ఇస్తామని ఆయన చెప్పారు. సరుకు రవాణా చార్జీలను కూడా ఆయన తగ్గించారు. ప్రయాణికులే తమ దేవుళ్లని ఆయన చెప్పారు. నిరుపేదలే తన లక్ష్యమని, అందువల్ల రైల్వే చార్జీలు పెంచడం లేదని ఆయన చెప్పారు. 50 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి చార్జీల్లో ఒక రూపాయి తగ్గించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే 25 వేల కోట్ల రూపాయల లాభాలు సాధించినట్లు ఆయన తెలిపారు. ఫార్చూన్ 500 కంపెనీల కన్నా రైల్వేల పనితీరు బాగుందని ఆయన చెప్పారు. యుపిఎ విధానాలే రైల్వే లాభాల్లో నడవడానికి కారణమని ఆయన చెప్పారు. లాభాల్లో రైల్వే సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన చెప్పారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రైల్వే 23 వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జించగలదని ఆయన అంచనా వేశారు. 2007 - 2008లో రైల్వే ఆదాయం 14 వేల కోట్ల రూపాయలు ఉందని ఆయన చెప్పారు. టికెట్ ఆదాయంలో 14 శాతం, సరుకు రావాణాలో 11 శాతం వృద్ధి సాధించినట్లు ఆయన తెలిపారు. నాలుగేళ్లలో రైల్వే ప్రణాళిక 11 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన చెప్పారు.

ముఖ్యాంశాలు

  • వీధివీధినా టికెట్ అమ్మకాల కేంద్రాలు
  • మొబైల్ ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యం
  • టికెట్ వెండింగ్ మిషన్ల ఏర్పాటు, ఇతర ఇంటర్నెట్ సౌకర్యాల పెంపు
  • వచ్చే స్టేషన్ ఏదో ముందే ప్రకటించే ఏర్పాటు
  • రైల్వే టాయిలెట్ల మార్పుపై దృష్టి
  • 6 వేల బోగీల్లో పర్యావరణ అనుకూల టాయిలెట్లు
  • రైల్వే వెబ్ సైట్ కు కొత్త రూపం
  • ఎంపిక చేసిన రైళ్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్
  • మాడ్యులాగ్ టాయిలెట్ల ఏర్పాటు
  • అన్ని స్టేషన్లలో హై లెవెల్ ఫ్లాట్ ఫారాల ఏర్పాటు
  • 50 పెద్ద రైల్వే స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్ల ఏర్పాటు
  • అవసరమైన స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
  • 2009 నాటికి కాల్ సెంటర్లతో రైళ్ల అనుసంధానం
  • కెకె లైన్ డబ్లింగ్ పనుల సర్వే
  • కొత్తవలస - కోరండల్ - జగదల్పూర్ డబ్లింగ్ పనుల సర్వే
  • 560 రైల్వే ఫ్లాట్ ఫారాల పొడవు పెంపు
  • మరిన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణకు కేటాయింపులు పెంపు
  • 2 ఏళ్లలో 6 వేల ఆటోమేటిక్ టికెట్ యంత్రాలు
  • 30 ప్రధాన కేంద్రాల్లో మల్టీ లెవెల్ పార్కింగులు
  • కొత్త వ్యాగన్ల రూపకల్పనకు విదేశీ కంపెనీలతో చర్చలు
  • కంటైనర్ రైళ్ల నిర్వహణకు మరో 15 మందికి లైసెన్సులు
  • స్మార్ట్ కార్డు ఆధారిత టికెట్ సిస్టం
  • 2010 తర్వాత అన్నీ స్టెయిన్ లెస్ కోచ్ లే
  • 24 గంటల సరుకు రవాణా టెర్మినళ్లు, 24 గంటలూ సరుకు రవాణా
  • రైల్వే భూముల్లో టెర్మినళ్ల ఏర్పాటుకు ప్రైవేట్ కంపెనీలకు అనుమతి
  • దక్షిణ మధ్య రైల్వేలో రైళ్లు ఢీకొనకుండా చర్యలు
  • గ్యాంగ్ మెన్ కు నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తింపు
  • రైల్వే ఉద్యోగులకు, తల్లీబిడ్డలకు ఆస్పత్రిలాంటి రైలు
  • కూలీలకు గ్యాంగ్ మెన్ గా ప్రమోషన్
  • ఢిల్లీ, ముంబయి, పాట్నా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ప్రమాణాలు
  • కేరళలో రైల్వే కోచ్ ల నిర్మాణ కర్మాగారం
  • ఈ ఏడాది పది కొత్త గరీబ్ రథ్ లు
  • ఈ ఏడాది 53 కొత్త రైళ్లు
  • కామన్ వెల్త్ క్రీడలకు ప్రత్యేక రైళ్లు
  • పెట్రోల్, డీజిల్ రవాణాలపై చార్జీల తగ్గింపు
  • Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+