అంగన్ వాడీ కార్యకర్తల అరెస్టు
హైదరాబాద్: అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు గురువారంనాడు అదుపులోకి తీసుకున్నారు. తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాత్రంతా వారు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద దీక్షా శిబిరంలోనే గడిపారు. గురువారం ఉదయం వారు శాసనసభ ముట్టడికి ప్రయత్నించారు. అంగన్ వాడీ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు వారిని అరెస్టు చేసి గోషా మహల్ స్టేడియానికి తరలించారు.
కార్యకర్తకు వేయి రూపాయలు, హెల్పర్ కు 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సిఐటియు నాయకురాలు పుణ్యవతి ఆందోళనకారులకు నాయకత్వం వహించారు. మంత్రి రాజ్యలక్ష్మి తదితరులు అంగన్ వాడీ కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అంగన్ వాడీ కార్యకర్తలు మొరాయించారు.












Click it and Unblock the Notifications