ప్రమాదంలో ఎమ్మెల్యే కుమారుడి మృతి
కడప: శాసనసభ్యుడు అహ్మదుల్లా కుమారుడు అమ్జాద్ ఖాన్ గురువారం కడప జిల్లా కేంద్ర కారాగారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎదురుగా వస్తున్న లారీ అమ్జాద్ ఖాన్ ప్రయాణిస్తున్న సఫారీ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అమ్జాద్ మృతి చెందాడు. అదే లారీ ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు.
లారీ, ఆర్టీసి డ్రైవర్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుమారుడి మరణవార్త విన్న శాసనసభ్యుడు అహ్మదుల్లా కన్నీరు మున్నీరు అయ్యారు. శాసనసభలో ఉండగా ఆయనకు సమాచారం అందింది. అహ్మదుల్లాను అదుపు చేయడం ఎవరి తరం కాలేదు.












Click it and Unblock the Notifications