సోనియా వెళ్లే వరకు మౌనం: ఎమ్మెస్సార్
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ ముగిసే వరకు తెలంగాణపై తాను మౌనవ్రతం దాలుస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ చెప్పారు. సోనియా సభ ముగిసే వరకు తాను ఏమీ మాట్లాడదలుచుకోలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సోనియా గాంధీ మార్చి 14వ తేదీన హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాదులోని పరేడు గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ జరుగుతుంది.
ఇదిలా వుంటే, సోనియా సభను విజయవంతం చేస్తామని తెలంగాణవాణిని వినిపిస్తున్న మరో సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. అది పార్టీ కార్యక్రమమని, దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణ గురించి గళమెత్తుతున్న జి. వెంకటస్వామి ఢిల్లీలోని ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవిత కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం తుదకంటూ పోరాడుతానని ఆయన చెప్పారు












Click it and Unblock the Notifications