బడ్జెట్ ప్రభావం: స్టాక్ మార్కెట్ పతనం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ ఏడాది బడ్జెట్‌లో రుణ విముక్తి ప్రకటన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పతనం అవుతోంది. చిదంబరం బడ్జెట్ ప్రసంగంలో రైతులపై వరాలు కురిపించడంతో సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా పతనాన్ని చవిచూసింది. చిదంబరం సుమారు రూ.60 వేల కోట్ల విలువైన పంట రుణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకింగ్ షేర్లు పెద్ద యెత్తున పతనమవుతున్నాయి.
సెన్సెక్స్ శుక్రవారం మధ్యాహ్నం సమయానికి సుమారు 350 పాయింట్లకుపైగా పతనమై 17,442 వద్ద కొనసాగుతోంది. చిదంబరం శుక్రవారం లోక్‌సభలో మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల్లో మార్చి 31, 2007కు ముందు మరియూ డిసెంబర్ 31లోగా చెల్లించాల్సిన పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు












Click it and Unblock the Notifications