బెంగుళూర్ లో హిందూపూర్ యువకుడి హత్య
బెంగుళూర్: బెంగుళూర్ లోని కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా హిందూపూర్ కు చెందిన యువకుడు కత్తిపోట్లకు గురై మరణించాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. 29 ఏళ్ల శశిధర్ రాత్రి చాలా ఆలస్యంగా కార్యాలయం నుంచి తిరిగి వచ్చాడని, తర్వాత మిత్రుడితో కలిసి బయటకు వెళ్లాడని, వారిద్దరు నడుస్తున్న సమయంలో ఒక దుండగుడు గొడవ పడి డబ్బులు అడిగాడని, డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో అతను శశిధర్ ను కత్తితో పొడిచాడని పోలీసులు వివరించారు.
వెంటనే శశిధర్ తాను పేయింగ్ గెస్ట్ గా ఉంటున్న స్థలానికి వెళ్లాడని, కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో అతన్ని కార్పోరేట్ ఆస్పత్రికి తీసికెళ్లారని, ఆస్పత్రిలోనే అతను మరణించాడని పోలీసులు చెప్పారు. రెండు నెలల క్రితమే శశిధర్ బెంగుళూర్ వచ్చాడు. దాడి చేసిన దుండగుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications