చిదంబరం ఎన్నికల బడ్జెట్

Finance Minister Chidambaram
న్యూఢిల్లీ: రైతులకు పెద్ద యెత్తున ఊరట కలిగిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం శుక్రవారంనాడు 2008 - 2009 సంవత్సరానికి గాను లోకసభలో బడ్జెట్ ను ప్రతిపాదించారు. మొత్తం మీద ఆయన ప్రజాకర్షక బడ్జెట్ ను ప్రతిపాదించారు. రైతులకు భారీ రుణ విముక్తి పథకాన్ని ప్రతిపాదిస్తూ ముందస్తు ఎన్నికలకు ఆయన సంకేతాలు ఇచ్చినట్లు భావించవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికా వ్యయం 2.43 లక్షల కోట్ల రూపాయలు, ప్రణాళికేతర వ్యయం 5.7 లక్షల రూపాయలు ఉండగలదని ఆయన అంచనా వేశారు.

ద్రవ్యోల్బణం నియంత్రణే తమ కర్తవ్యమని ఆయన చెప్పారు. వృద్ధిరేటు 8.7 శాతం ఉందని ఆయన చెప్పారు. ఆగస్టు నుంచి స్టాక్ మార్కెట్లు సంక్షోభంలో పడడంతో కాస్తా దెబ్బ తిన్నామని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వృద్ధి రేటు సాధిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2.6 శాతం మాత్రమే ఉందని ఆయన చెప్పారు. విదేశీ నిధుల ప్రవాహంపై దృష్టి పెట్టామని, ఆర్థిక లోటుకు మించి విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఉందని ఆయన చెప్పారు. అన్ని రంగాలవారికి ఏదో మేరకు రాయితీలు ప్రకటిస్తూ ఆయన బడ్జెట్టులో ప్రతిపాదనలు చేశారు. విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రంగాలకు 20 శాతం నిధులు పెంచారు. ఆరో వేతన సవరణ సంఘం సిఫార్సులు మార్చిలో వస్తాయని, ఈ సిఫార్సులు ఉద్యోగులు ఆశిస్తున్నట్లుగానే ఉంటాయని ఆయన చెప్పారు. ఆహార ధాన్యాల దిగుబడిలో ఆల్ టైం రికార్డు సాధించామని ఆయన చెప్పారు.

ముఖ్యాంశాలు

  • భారత నిర్మాణ్ పథకానికి కేటాయింపులు రూ. 30,280 కోట్లు
  • 2.4 లక్షల కోట్ల పంట రుణాలు
  • మధ్యాహ్న భోజనం పథకానికి కేటాయింపులు రూ. 80 వేల కోట్లు
  • ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని నవోదయ విద్యాలయాలు
  • 410 కొత్త కస్తూర్బా విద్యాలయాలు
  • 123 జిల్లాల్లో నెహ్రూ యువకేంద్రాలు
  • 6 వేల ఉన్నత ప్రమాణాల పాఠశాలల నిర్మాణం
  • 8-12 తరగతుల విద్యార్థుల ఉపకార వేతనాలకు 750 కోట్ల రూపాయల కేటాయింపులు
  • 16 కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాలు
  • ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లలో కొత్త ఐఐటిలు
  • విద్యార్థుల్లో సైన్స్ జిజ్ఞాసను పెంచేందుకు 85 కోట్లు
  • పాఠశాల విద్యకు 455 కోట్ల రూపాయల కేటాయింపు
  • విద్యకు 34,400 కోట్ల రూపాయల కేటాయింపు
  • ఆరోగ్యానికి కేటాయింపులు రూ. 16,534 కోట్లు
  • దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఆరోగ్య బీమా పథకం
  • అన్ని బ్లాకుల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం
  • అంగన్ వాడీ కార్యకర్తల వేతనాలు పెంపు
  • వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు రూ. 400 కోట్లు
  • అసంఘటిత కార్మికులకు ఆరోగ్య భీమా
  • అన్ని జిల్లాలకు ఉపాధి హామీ పథకం వర్తింపు
  • భోపాల్, త్రివేండ్రంల్లో ఐఐసిటిలు
  • చెన్నై సముద్రపు నీటిని మంచినీరుగా మార్చేందుకు రూ. 300 కోట్ల కేటాయింపులు
  • ఈశాన్య రాష్ట్రాలకు 16,480 కోట్ల రూపాయల కేటాయింపులు
  • పాఠశాలల్లో మంచినీటి సౌకర్యాలకు రూ. 200 కోట్లు కేటాయింపు
  • రక్షణ శాఖకు లక్షా అరవై వేల రూపాయల కేటాయింపు
  • రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ స్కాలర్ షిప్ లకు రూ. 75 కోట్ల కేటాయింపు
  • మైనార్టీలకు రెట్టింపు నిధులు
  • కేంద్ర పారా మిలటరీ బలగాల్లో మైనారిటీలకు మరిన్ని నియామకాలు
  • ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లకు రూ. 80 కోట్లు కేటాయింపు
  • స్వయం సహాయక బృందాలకు ఎల్ ఐసి
  • పిల్లల సంక్షేమ పథకాలకు రూ. 33,434 కోట్ల కేటాయింపు
  • మహిళల సంక్షేమాభివృద్ధికి రూ. 11460 కోట్ల కేటాయింపు
  • వ్యవసాయానికి రూ. 2,80,000 కోట్ల కేటాయింపు
  • చిన్న తరహా సాగునీటికి రూ. 20 వేల కోట్ల కేటాయింపు
  • హర్యానా, చండీఘడ్ ల్లో స్మార్ట్ కార్డుల రేషన్ పైలట్ ప్రాజెక్టు
  • నిరుపేద వృద్ధులకు పింఛను పథకం
  • గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయింపులు 14 వేల కోట్ల రూపాయలు
  • ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురంలో హ్యాండీక్రాఫ్ట్ క్లస్టర్
  • గ్రామీణ విద్యుదీకరణ పథకానికి రూ. 5,500 కోట్ల కేటాయింపులు
  • స్టాక్ మార్కెట్లలో అన్ని లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి
  • అన్ని ఫైనాన్షియల్ మార్కెట్లలో పాన్ కార్డు తప్పనిసరి
  • మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ
  • కామన్ వెల్త్ క్రీడలకు రూ. 624 కోట్ల కేటాయింపులు
  • నేషనల్ నాలెడ్జి సెంటర్ల ఏర్పాటుకు వంద కోట్ల రూపాయల కేటాయింపు
  • Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+