టెన్త్ దాకా మధ్యాహ్న భోజనం: వైయస్

Y S Rajasekhar Reddy
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పదవ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 8వ తరగతి వరకు ఈ పథకాన్ని అమలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 9,10 తరగతల పిల్లలకు ఈ పథకాన్ని అమలు చేస్తుందని, దీనివల్ల పదో తరగతి వరకు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందని ఆయన అన్నారు. ఈ పథకం ఈ ఏడాది జూన్ నుంచి అమలులోకి వస్తుందని ఆయన చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రతిపాదించిన బడ్జెట్ ను ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశంసించారు.

కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయానికి, రైతులకు, గ్రామీణాభివృద్దికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆయన చెప్పారు. హైదరాబాదులో నేషనల్ ప్లాన్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పట్ల ఆయన హర్షం వక్తం చేశారు. రుణ మాఫీ పథకం వల్ల రాష్ట్రంలోని రైతులకు ఎలా మేలు జరుగుతుందనే విషయాన్ని ఆయన వివరించారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్టులో తగిన ప్రాధాన్యం ఇచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో తలపెట్టిన ఐఐటిని కూడా బడ్జెట్టులో పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ లో తలపెట్టిన హ్యాండీక్రాఫ్ట్ మెగా క్లస్టర్ వల్ల మహిళలకు లాభం చేకూరుతుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+