కర్నూలు వివాదం పరిష్కారం
హైదరాబాద్: కర్నూలు కార్పోరేషన్ సమస్య పరిష్కారమైంది. అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు సహకరించేలా చూస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో మేయర్ రఘురాంరెడ్డితో సహా కార్పోరేటర్లు తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. ముఖ్యమంత్రి హామీతో తాము సంతృప్తి చెందామని మేయర్ చెప్పారు.
అధికారుల వైఖరికి నిరసనగా మేయర్, కార్పోరేటర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసిన వారంతా ఆదివారంనాడు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. అధికారులు సహకరించేలా చూస్తానని, ఏమైనా ఉంటే తనకు చెప్తే పరిష్కారం చేస్తానని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. ప్రజలతో ఇబ్బంది లేకుండా చూస్తానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications