విజయవాడలో భక్తులపై లాఠీచార్జీ
విజయవాడ: విజయవాడ దుర్గ గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనూహ్యంగా భక్తజనం రావడంతో కృష్ణా నదీ తీరంలో తొక్కిసలాట జరిగింది. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. విపరీతమైన రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు జరగకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అరకొర ఏర్పాట్లపై భక్తులు అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. భవానీ దీక్ష సమయంలో ఈ తోపులాట చోటు చేసుకుంది.
గురువారం తెల్లవారుజామున రెండు గంటల నుంచే భక్తులు కృష్ణా తీరానికి చేరుకోవడం ప్రారంభమైంది. దుర్గా ఘాట్ నుంచి వినాయక గోపురం వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు. దుర్గా ఘాట్ నుంచి మాత్రమే భక్తులను అనుమతించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. మరిన్ని చోట్ల భక్తులను అనుమతించి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోపులాటలో, లాఠీచార్జీలో భక్తులు కొంతమంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications